a54

54

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నా యేసూ, ఆత్మ సూర్యుడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ.నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయగా నా యొద్ద నుండు రక్షకా.నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింప జావజాలను.నేడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకి జేర్చుము.రోగిని స్వస్థపఱచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖము బాపి యానంద మియ్యుము.

Post a Comment

Previous Post Next Post