a556

556

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నే బీద చిన్న పిల్లను నా బుద్ధి స్వల్ప మయినది నా దివ్య యేసు కొఱకు నే నేమి చేయగలను?
    నిత్యంబు చిన్న పనులు నే చాల జేయవచ్చును నా చిన్న తప్పు లన్నియు నే చక్క పెట్టవచ్చును.
    మనస్సునందు కోపము వేమాఱు పుట్టునప్పుడు నా కన్ను లెఱ్ఱ జేయక నే నోర్చు కొనవచ్చును.
    నే తిన్నగాను నడ్చుచు ఇల్లంత వెలిగించుచు నా యేసుకై యుల్లాసము బుట్టింపవచ్చు నెప్పుడు
    నే నెంత చిన్న పిల్లను నా కుండు చిన్న బాధకు నే తాలి ప్రేమ స్తోత్రము లర్పించుచుండగలను.

Post a Comment

Previous Post Next Post