96
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జన మూర్తి ఆకస రాసుల ఆదిపతి అవనీ సృజనాత్మ ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత అనుదిన కృపాలిడు సుఖదాత.
పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమం పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాప క్షమాపణ గానం - బహు అనవరతము నిజబలిదానం.