16 యెహోవా ప్రేమ రాగం - శంకరాభరణము తాళం - ఆది యెహోవా నా మొఱ లాలించెను దన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుఁడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవా||పిశాచి గడిమిఁబడఁగొట్టెను దన వశాన నను నిలువఁ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమునఁజేర్చి సేదఁదీర్చెను ||యెహోవా||మదావళముఁ బోలు నామదిన్ దన ప్రదీప్త వాక్యాం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికిఁ జేర్చెను ||యెహోవా||అనీతి వస్త్ర మెడలించెను యేసునాధు రక్తమున ముంచెను వినూత్న యత్నమె ద నూని యెన్నఁడు గనన్ వినన్ బ్రేమ నాకుఁ జూపెను ||యెహోవా||విలాపములకుఁ జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకిలాగి నను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను ||యెహోవా||అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాఁ చక తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను ||యెహోవా|| ✍ పురుషోత్తము చౌధరి Yehova Naa Mora Laalinchenu Dana Mahaa Dayanu Nanu Ganinchenu Aharnishala Deenaheenudagu Naa Du Haayanedu Dhvani Grahinchi Manipenu || Yehova || Pishaachi Gadimi badagottenu Dana Vashaana Nanu Niluva Bettenu Prashaantha madhura Su Vishesha Vaakphala Nishaanthamuna Je Rchi Seda Deerchenu || Yehova || Madaavalamu Bolu Naa Madin Dana Pradeeptha Vaakyaam Kooshaa Hathin Yadhechchalanniti Gudinchi Paapapu Modal Thudal Nari ki Dariki Jerchenu || Yehova || Aneethi Vasthra Medalinchenu Ye Sunaathu Rakthamuna Munchenu Vinoothna Yathname Da Nooni Yennadu Ganan Vinan Bre Ma Naaku Joopenu || Yehova || Vilaapamulaku Jevi Nichchenu Shrama Kalaapamulaku Selavichchenu Shilaanagamu Pai Kilaagi Nanu Sukha Kalaavalul Mana Sulona Nilipenu || Yehova || Aganya Paapiyani Throyaka Na Nnu Goorchi Thana Suthuni Daa Chaka Theginchi Mruthi Ko Ppaginchi Paapapu Negul Digul Soga Sugaa Nananchenu || Yehova || ✍ Purushottam Chowdhary akk 16 Read more
No comments:
Post a Comment