1 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో నర్పించుడి } 2 దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుఁడి ||నీతి|| చదలఁ బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కఁగా } 2 సదమలంబగు దైవనామము సర్వదా నుతిఁజేయను ||నీతి|| సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్ర్రము లన్నియు } 2 గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిఁజేయను ||నీతి|| గీత తాండవ వాద్యములచేఁ బ్రీతి పరచెడు సేవతో } 2 పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుఁడి ||నీతి|| పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని } 2 పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు ||నీతి|| ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని } 2 వెలయు స్తుతి వే నోళ్లతోడను విసుగు జెందక జేయుడి ||నీతి|| ఆత్మ నీవిఁక మేలుకొని శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని } 2 త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే ||నీతి|| ✍ పసుపులేటి దావీదు Neethigala Yohoavaa Sthuthi Mee – Yaathmathoa Narpinchudi-Mee Yaathmathoa Narpinchudi Dhaatha Yow Mana Kreesthu Neethini Dhaalchu Koni Sevinchudi || Neethigala || Chadhala Pudamiyu Raviyu Jaladhiyu- Nadhulu Girulunu Chakkagaa =Sadhamalambagu Dhaiva Naamamu-Sarvadaa Nuthi Jeyanu || Neethigala || Sarva Sakthuni Kaaryamulakee –Sarva Raashtramu Lanniyu =Garvamulu Vidi Thalalu Vanchuchu - Nurviloa Nuthijeyanu || Neethigala || Geethaa Thaandava Vaadhyamulache –Preethi Parachedu Sevathoa = Paathakambulu Pariharinchedu – Dhaathane Sevinchudi || Neethigala || Parama Dhuuthalu Naruni Pudamini –Moralu Pettuchu Dhevuni = Paramu Nandhunnatti Yesuni –Paadamulu Sevinthuru. || Neethigala || Eilanu Bhakthulu Kuudukoni Yaa- Balamu Kalgina Dhevuni = Velayu Sthuthi Venoallathoadanu – Visugu Cendhaka Ceyudi || Neethigala || Athma Neevika Melukoni Su-Ddhaathma Yesuni Tandrini = Thrithva Magu Naa Yeka Dhevuni –Harshamuna Sevimpave || Neethigala || ✍ Pasupuleti Dhaveedhu akk 1 Read more
No comments:
Post a Comment