1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట దినదినముకు దిక్కు నీవే మా దేవుడా మమ్ము కనిపెట్టి కాపాడ నెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు||పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతో గావు మమ్ము గావు మమ్ము ||దినదినమునకు||పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ము భట్టి రక్షింప వచ్చిన బ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు||కష్టములు కాని శోధనలు మమ్ము జుట్టు కొనగ నీ కృపనెంతో చూపుదువే చూపుదువే ||దినదినమునకు||నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందబోవు కాలమందు దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు||సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు||ఆస గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ||దినదినమునకు||విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగ బంపించుమీ శ్రేష్టముగను శ్రేష్ఠముగను ||దినదినమునకు|| ✍ గొల్లపల్లి నతానియేలు Dhina Dhinamunaku- Dhikku Neeve – Maa Dhevudaa – Mammu = Kanipetti Kaapaada Nepudu – Kartha Veeve Kartha Veeve || Dhina || Paniki Maalina Vaaramu – Paapishtulamu Needhu = Kanikaramunu Juuchi Krupathoa – Gaavu Mammu Kaavu Mammu || Dhina || Paapamaina Loakamaina Pi – Saachaka Maina Mammu = Bhatti Rakshimpa Vachchina – Praapu Neeve Praapu Neeve || Dhina || Kashtamulu – Kaani Soadhanalu Mammu – Chuttu Konaga Nee Krupa Nenthoa – Chuupudhuve Chuupudhuve || Dhina || Nindhalaina Dhebbalaina - Needhu Naamamuna Memu = Pondha Boavu Kaalamandhu – Thandri Neeve Thandri Neeve || Dhina || Sathyamaina Vaakhya Michchi – Saaramunu Thelipi Needhu = Nithya Jeeva Maarga Mandhu – Nilipithive Nilipithive || Dhina || Aasa Golpi Aathmaloa Naa Kyaanubhava Mondhinchi Neeku = Dhaasulamai Brathuku Natlu – Dhairya Mimmu Dhairya Mimmu || Dhina || Visvaasa Nireekshana Prema – Limpugaa Maaku Neevu – Saasva Thamuga Pampinchu Mee – Sreshtamuga Sreshtamuga || Dhina || ✍ Gollapalli Nathaniyelu akk 1 Read more
No comments:
Post a Comment