1 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నేఁ జాలుదునా ||యన్ని||పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు తింతు ||నన్ని||కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ||నన్ని|| ✍ బేతాళ జాన్ Anni kaalambula-nunna yoahoavaani- nnennatharambayoa kanna thandri – vanne kekkina moaksha –vaasaali sannuthu-lunnatha mai yunda munne niiku || nanni || Ninnu prakatana seya- nikhila loakamulanu- bannuga chesina baluda viive = unna loakambula –nudugaka karunaa sampannatha thoa nelu-prabhuda viive- enna sakhyamu kaaka – unna lakshanamula sannuthinchutaku ne-chaaludunaa || yanni || Puttimpa niivanchu- poashimpa niivanchu-gittimpa niivanchu – kiirthinthunu = vatti paniki maali natti maanavulache – patti rakshimpa baa-dhyunda vanchu = dhattamaina krupanu dari jercha naakicchi –pattayi nilachiyundu –prabhuda vanchu = kattadache gada-muttudhanuka naa –pattukoladhi ninnu prasthu thinthu || yanni || Kaarunya nidhi viivu – katinaathmudanu nenu- bhuuri suddhudaviivu-paapi nenu = saara bhaagyuda viivu-jagathiloa naakanna daaridhrude ledu- tharachi chuuda = saara sadhgunamula – sampannudavu niivu – ghoara durguna sam-chaari nenu = e riithi sthuthi yinthu –ne riithi sevinthu - nera mennaka proava- neranammithi || yanni || ✍ Bethala John 3-1 3-2 3-3 akk 1 Read more
No comments:
Post a Comment