1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ నాయెను నా యేసు ఎంత ఘోరము లాయెను ఈ మానవులు యెరుషలేము బైటకు దీయ నేమి నేరము దోచెను || ఏమి || మున్ను దీర్ఘదర్శు లెన్నిన రీతిని కన్నెకడుపున బుట్టిన నా యేసు వన్నె మీరంగ బెరిగిన చెన్నైన నీ మేను చెమట బుట్టంగ నీ కిన్ని కడగండ్లాయెను || ఏమి || కన్నతల్లి యిట్టి కడగండ్లు గాంచిన కడుపేరీతినోర్చును నా యేసు గాంచనేలను గూలును నిన్నెరిగి నట్టివారు నీ పాట్లు గని యేడ్చు చున్నారలీ వేళను || ఏమి || అయ్యయ్యో యూదు లింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి పూని నా యేసు మోయ శక్యంబు గాని కొయ్యమూపు నెత్తి రయ్య నీ కెంత భార మయ్య వెతజూడ జాలను || ఏమి || పిల్ల లాట్లాడినట్లు ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి నా యేసు పల్లరుపు లధికమాడిరి ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము మీ దెల్లనుమిసిరి || ఏమి || కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజరిచి వేడ్కను నా యేసు అట్టి వారెవ్వరంచును విరగ భావంబునడిగి నెక్కిరించుచు నీ వెంబడి వత్తురేలను || ఏమి || ఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను నేల బరిచిన రీతిగా నా యేసు మ్రోలబరిచిరియట్లుగ ఏల యీ కోడిగంబు లేల నీమీద కంటు ఏమి నేరంబు లేదుగ || ఏమి || చాల బాధించి క పాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతులినుప చీలలతో బిగించ జిమ్మి రక్తంబు గారెను || ఏమి || నాదేవ నా దేవ నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా యేసు నమ్మితివి లోబడితివి వేదనధికంబాయె నే దిక్కులేనట్టు యూదాళి కగుపడితివి || ఏమి || అంధకారము దేశ మంతట గలిగెను ఆవరించెను సూర్యుని నా యేసు ఆలయపు తెరచినిగెను బంధ స్తంభమునుండి బహు గొప్ప శబ్దముతో బిలిచెద వేమిట్లను || ఏమి || ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా యాత్మను నా యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటునొందితివి ఎంతో వింతై నిలుచును || ఏమి || నీ చాత్ము డొకడు నిఱ్ఱ నీల్గి బల్లెంబుతోడ నీ ప్రక్క బొడిచె చావను నా యేసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి కస్తి కెట్లు నీ యొడలుసైచె నెంతో చోద్యంబు చూడను || ఏమి || పాపాత్ములకు పూట బడిన వల్లనే యింత పరితాపమరణమాయెను నా యేసు ఎరిగే యనుభవించెను నా పాప ఫలము నిన్ను వేపాట్లు బెట్టి చంప నోపితివయ్య ప్రేమను || ఏమి || ఎంత యమూల్యమైన దెంతయనంతమైన దెంతయగాధమైనది నా యేసు ఎంతో యుచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన మాకు ఏల కనుపర్చబడ్డది || ఏమి || ప్రేమాతిశయుడనేను ఏ మాత్రుడను నెన్న నా మానసమున కందను నా యేసు ప్రేమ సారంబు తెలియను పామరాళిని బ్రోచు క్షేమాధికారి నిన్ను యేమంచు వర్ణింతును || ఏమి || ✍ బేతాళ జాన్ Yemi nerambu leka – yaa marana sthambamu - nela moaya naayenu – naa yesu – eantha ghoaramu laayenu = eii maanavulu yeruushalemu baitaku dhiiya – nemi neramu dhoachenu || yemi || munnu dhiirga dharsu lennina riihini – kanne kadupuna putina - naa yesu – vannemiiraga perigina = chennaina nii menu - chemata puanga nii – kinni kadagandlaayenu || yemi || kanna thalli yitti- kada gandlu gaanchina – kadupe riithi noarchunu – naa yesu –gaancha nelanu guulunu – ninnerigi natti vaaru – nii paatlu gani yedchu – chunnara lii velanu || yemi || ayayayyoa yuudhu – lintha neyyambu thappi dhaina – bha yambu vidichi puuni – naayesu – moaya sakhyambu kaani = koyya muupu neththi – rayya nii kentha bhaara – mayya vetha chuuda jaalanu || yemi || pilla laatlaadinatlu – mullulatho kiriitamalli neththina gottiri – naa yesu – pallarupuladhika maadiri = ella vaari loa ninnu – egathaali gaavinchi – mogamu miidhellanu numisiri || yemi || koradaalathoa ninnu – kotti kandlaku gantha – gatti chejarichi vedkanu – naa yesu – atti vaarevvaranchunu = viraga bhaavambu nadigi – nekkirinchuchu nii – vembadi vathurelanu || yemi || ealedivaaru naduva – mroala vasthrambulanu – nela parachina riithigaa – naa yesu – mroala parichiri atluga = eala koadigambu – lela nii miidha kantu – emi nerambu ledhuga || yemi || chaala baadhinchi ka- paala sthalamunaku vachchi – nela paathiri koyyanu – naayesu – jaali ravvanha lekanu = kaalu sethulinupa chiilalathoa bigincha – jimmi rakthambu gaarenu || yemi || naa dheva naa dheva – nannendhukai vidichi – naa vanchu mora pedihivi – naayesu nammithivi loa badithivi = vedhanadhikambaaye – ne dhikkuu lenattu – yuudhaali kagu padithivi || yemi || andhakaaramu dhes – manhata kaligenu – aavarinchenu suuryuni – naa yesu –aalayapu thera chinigenu = bandha sthambamu nundi – bahu goppa sabdhamuthoa pilichedha ve mitlanu || yemi || oa handri nii chethi–koppa ginchu chunnaanu – onaranga naa aathmanu – naa yesu– ani praanamunu viidenu = e happidhambu leka – nii paatu nondhithivi – eanthoa vinthai niluchunu || yemi || niichathmu dokadu nirra – niilgi ballembu thoada – nii prakka bodice chaavanu –naa yesu – niiru neththuru gaarenu = echi yunnatti kasthi – ketlu nii yodalu saiche – nenthoa choadhyambu chuudanu || yemi || paapaathmulaku puuta – badina vallane yintha – parithaa pa marana maayenu- naayesu –erige anubhavinchenu = naa paapa phalamu ninnu – vepaatlu betti champa – noapithi vayya premanu || yemi || entha amuulyamaina – dhentha ananthamaina – dhentha agaadhamainadhi – naayesu – eanthoa uchitha mainadhi = enthao vinthaina prema – eahyulamaina maaku eala kanaparacha baddadhi || yemi || premaathisayuda nenu – emaahrudanu nenna – naa maanasamuna kandhanu –naa yesu – prema saarambu theliyanu = paamaraalini broachu – kshemaadhikaari ninnu Yemanchu varninthunu || yemi || ✍ Bethala John akk 1 Read more
No comments:
Post a Comment