1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా ||కరుణ|| నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ గ ||నజరేతు|| మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా ||మరియయనే|| మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను|| పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె ||పరమతండ్రి|| ✍ గొల్లపల్లి నతానియేలు Karuna Saagara Niive Kaavaa- Marana Mondha Silva Mettaku Moasinaavaa = Karunasaagara Naive Kaavaa = Mariyu Kalvari Metta Miidhanu Kadaku Mekulu Gottabadi Nii – Mara Na Rakthamu Chetha Narulaku–Parama Rakshana Thelpinaavaa || Karuna || Najarethu Pura Vihaaraa–Narula Broava– Naru Dhenchi Naav Aa=Najarethu Puravihaaraa= Prajala Paapamu Parihari Chiyu–Prajala Sadhgathi Nondha Jeyanu – Vijayamunu Pondhi Thivi Yilaloa – Sajanu Landharu Bhajana Seyaga || Najarethu || Mariya Ane Kanya Kumaaraa – Naraka Baadha Thappinchi Naavaa = Mariya Anekanya Kumaaraa = Maarga Sathyamu Jiivanamulii – Mahini Nammina Vaari Kellanu – Miire Gaakika Vare Lerani – Saare Saareku Cheppinaavaa || Mariya Ane || Mahilonu Manuja Kumaaraa=Yahaa Thandrini Vedi Naavaa =Mahiloanu Manujakumaaraa=Yihamuloa Ninu Nammu Vaar Nini – Bahu Nii Kataakshambu Chetha Nu– Mahima Janakaa Kaavumanuchu- Thraahi Yani Praardhinchi Naavaa || Mahilonu || Parama Thandri Priya Kumaaraa – Paavanamu Cheya Miire Kaaraa = Parama Thandripriya Kumaaraa = Paramudaa Nii Pancha Gaayamuu Larayagaa Rakthamuthoa Nindenu – Dharanu Maa Paapamulu – Kaduganu – Chiramugaa Nu Ththaramunaaye Karuna Saagara || Parama Thandri || ✍ Gollapalli Nathaniyelu akk 1 Read more
No comments:
Post a Comment