1 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిం దా నొక్కడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ||పుట్టగిట్టంజేయదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌ||మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె లట్లు దిరుగజేర్పన్ మందను ||భీకరుండౌ|| Bheekarundaw Maa Yohoavaa- Peetamedhutanu Guudare –Yekamai Saashtaangapadi Sarvesvaruni Goni Yaadare || Bheekarundaw || Mattitoane Mammunella – Maanavuluga Srujinchenu=Eitti Sakthundow Prabhunme Mecchugaa Madi Nenthumu || Bheekarundaw || Eari Thoadu Leka Mamu Sa-Rvesvarudu Srushtincenu –Dhaarunin Thaanokkade Maa Dhaivamani Puujinthumu || Bheekarundaw || Putta Gittanjeya Thaanai Natti Dhevuni Saktini =Battugaa Loakastulaaraa Prasthuthimpare Bhakthini || Bheekarundaw || Meti Sangeethambulupai – Minta Naarava Mondanu = Chaatare Vevella Noallanu Sannuthul Prabhuvandanu || Bheekarundaw || Mikkili Kashtambulathoa – Mitthikini Baalpondanu = Dhikku Leni Gorre Latlu –Dhiruga Jherpan Mandhanu || Bheekarundaw || akk 1 Read more
No comments:
Post a Comment