1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ జగతిలోన నెవ్వరు లేరు వాని కన్న యేసుని వాక్యము ఎవ్వరి కబ్బునో దోసము విడి పర వాసము దొరకును ||యేసు||సత్యుఁడు నిత్యుఁడాయ నన్న యీ సర్వ సృష్టిఁ జక్కఁగ సలిపి నిలిపె నన్న వ్యత్యాసము లే మియు లేకుండఁగ సత్యుండు చేసెను సర్వజగం బును||యేసు||నిరాకారుఁడు నిశ్చయుఁడన్న నరుల రక్షింప నరావతారుఁడై నాఁడన్న నరుల పాపములుఁ పరిహరించుట కొరకై మరియ కొడుకై పుట్టెను ||యేసు||పరిశుద్ధవంతుఁ డాయ నన్న ప్రభు యేసు నందఁ పాపమే గానఁ బడుట సున్న పరులను గావను ధరలోఁ దిరిగెను నరుల నడుమ బహు నిరపరాధముతో ||యేసు||భేదాభేదములు గాని బోధ నాధుఁడొనరించె సాధు లెల్లను సంతోషింప బాధలుఁబడు స ద్రిక్తులతోడను సాదర వాక్కులు జక్కగ పలికెను ||యేసు||మహిలోన మనుజు లెవ్వ రైనఁ జేయ లేనట్టి మహిమాద్బుతములఁ జేసె నన్న మహా రోగులను మఱి మృతులను మహా మహుండు స్వస్థుల మఱి గావించెను ||యేసు||వర్ణింప వలనుకాని వాఁడు మన కోసర మతడు మరణమై మరల బ్రతికినాడు పరలోకమునకు మరి వేంచేసిన పరుఁ డగు క్రీస్తుని పాదముఁ బట్టుము ||యేసు||పరిశుద్ధ దూతల నాదముతో ప్రభు యేసు క్రీస్తు ప్రకాశ వస్త్ర మహిమలతోఁ పరమునుండి బహు త్వరగా వచ్చును ధరలో నమ్మిన నరులను బ్రోచును ||యేసు||న్యాయంబు దీర్చు దినము గలదు నమ్మని వారెల్ల సాయంబు వెదకినను గనపడదు సువార్త న్యాయముఁ దీర్చును నడవడి చొప్పున నమ్మని పాపుల నరకము జేర్చును ||యేసు||నమ్మండీ నష్టము నొందక యేసుని నమ్మిన పొమ్మని చెప్పఁడు సుమ్మండి ఇమ్ముగఁ గృపతో నిలలోఁ గాచును పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును ||యేసు|| ✍ గొల్లపల్లి నతానియేలు Yesu Kreesthuni Golva Ranna- ee Jagathiloana – Eavvaru Leru Vaani Kanna = Yesuni Vaa Khyamu Eavvari Kabbunoa – Dhoasamu Vidi Para Vaasamu Dhorakunu || Yesu || Sathyudu Nithyundaayananna Yee Sarva Srushti Chakka Ga Salipi Nilipe Nanna = Vathyaa Samule – Miyu Lekundaga – Sathyundu Chesenu – Sarva Jagambunu || Yesu || Niraakaarudu Nischaydanna- Narula Rakshimpa – Naraava Thaaru Dai Naadanna = Narula Paapamulu – Pariharinchuta – Korakai Mariya Kodukai Puttenu. || Yesu || Parisudhdhavanthu Daayananna - Prabhu Yesu Nandha – Paapame Gaana Badutasunna = Parulanu Gaavanu – Dharaloa Thirigenu – Narula Naduma Bahu – Nirapa Raadhamuthoa || Yesu || Bhedhaa Bhedhamulu Gaani Boadha – Naadhu Donarinche – Saadhu Lellanu Santhoashimpa = Baadhalu Badu Sa –Dhrikthula Thoadanu – Saadhara Vaakkulu – Chakkaga Palkenu || Yesu || Mahiloana Manuju Levvaraina –Cheya Lenatti – Mahimaa Dhbhuthamula Jese Nanna = Mahaa Roagulanu – Mari Mruthulanu Mahaa – Mahundu Svasthula Mari Gaavinchen ----- - || Yesu || Varnimpa Vaalanu Kaani Vaadu Mana Koasara Mathadu – Maranamai Marala Brathiki Naadu = Paraloakamunaku – Mari Venchesina – Parudagu Kreesthuni – Paadhamu Pattumu || Yesu || Parisudhdha Dhuuthala Naadhamuthoa – Prabhu Yesu Kreesthu – Prakaasa Vasthramahimalathoa = Paramu Nundi Bahu = Thvaragaa Vachchunu – Dharaloa Nammina – Narulanu Broachunu || Yesu || Nyaayambu Theerchu Dhinamu Galadhu – Nammani Vaarella – Saayambu Vedhakinanugana Padadhu = Suvaartha Nyaayamu Theerchunu – Nadavadi Choppuna – Nammani Paapula – Narakamu Jerchunu || Yesu || Nammandee Nashtamu Nondhaka – Yesuni Nammina – Pommani Cheppadu Summandi= Eimmuga Krupathoa – Nilaloa Gaachunu – Pimmata Moaksha Puramuna Jerchunu .. ..... || Yesu || ✍ Gollapalli Nathaniyelu akk 1 Read more
No comments:
Post a Comment