1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వారు భాగ్యవంతు లౌదురు భూ లోకమందు వారు భాగ్యవంతులౌదురు చారు శుభవార్తా రవంబు గోరి యాకర్ణించి భక్తి మీరఁ దెలిసికొనిన యట్టి ధీరు లెవ్వ రెవ్వరో ||వారు||వారు నడుచు మార్గమందున సుక్షేమ రాజి వారి ననుసరించు నెందును తేరి చూడ రాని దే దీప్యమాన దివ్యసత్య భూరి తేజ మాజనములఁ బొలుపు మీరఁ జుట్టుకొనును ||వారు||విమోచకుని నామమందున దజ్జనంబుల విశ్రుతానందంబు ప్రాణముల అమందముగ హెచ్చరించు నతని నీతి రీతిఁ దజ్జ నముల కోర్కె వృద్ధి బొం దంగఁ జేయు సంతతంబు ||వారు||నరులపై బిశాచమును నిందా స్థాప నంబు జేయంగలేదు పరగు ప్రకాశమును బ్రాపు నైన సర్వే శ్వరుఁడు బలము రక్షయు న వారితముగ మనకు నిచ్చు ||వారు||వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా వన్నె మీర మీ రాజు సురుచిరముగ శాశ్వతముగఁ పరిపాలించు మీ దేవుఁడు నిరతముగను జీవించు నీతి భరిత చిత్తుఁడగుచు ||వారు|| ✍ విలియం డాసన్ Vaaru Bhaaghyavanthu Lowdhuru Bhuu Loakamandhu – Vaaru Bhaaghya Vanthu Lowdhuru = Chaaru Subha Vaarthaa Ravambu – Goari Yaakarninchi Bhakthi – Miira Thelisi Konina Yatti – Dhiiru Levva Revvaroa || Vaaru || Vaaru Naduchu Maarga Mandhuna– Sukshema Raaji – Vaari Nanusarinchu Nendhunu = Theri Chuuda Raani Dhe –Dhiipya Maana Dhivya Sathya – Bhuuri Theja Maa Janamula – Bolupu Miira Chuttu Konunu || Vaaru || Vimoachakuni Naamamandhuna – Dhajjanambula – Visruthaa Nandhambu Praanamula = Amandhamuga Hechcharinchu – Nathani Niithi Riithi Dhajja –Namula Kaorke Vrudhdhi Bom-Ndhanga Jeyu Santhathambu || Vaaru || Narulapai Pisaachamunu – Nindhaa Sthaapa – Nambu Che Yanga Ledhu = Paragu Prakaasamunu = Braapu Naina Sarve – Svarundu Balamu Rakshayu Na- Vaarithamuga Manaku Nichu || Vaaru || Vara Guna Prasasthulaaraa – Kraisthavulaaraa – Ane Miira Mii Raaju = Suru Chiramuga Saasvathamuga – Paripaalinchu Mii Dhevudu – Nirathamuganu Jiivinchu – Niithi Bharitha Chiththu Daguchu || Vaaru || ✍ William Dason akk 1 Read more
No comments:
Post a Comment