1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పరములోన బరములోన పాప మేమి లేదుగా నరయ దాని గోరు వారి కాశ యిందు లేదుగా ||పరములోన||వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు స్వామి సేవ గల్గుగా ||పరములోన||ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకు గంటి నీళ్లు దుడుచుగా ||పరములోన||అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుగు వెలుగు నట్లు స్వామి సన్నిధి యుండుగా ||పరములోన||దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పు దీర్చి క్రీస్తు ఆశ్రయముగ నిల్చుగా ||పరములోన||అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన|| ✍ గొల్లపల్లి నతానియేలు Paramulona Baramulona- Papa Memi Ledhugaa = Naraya Dhani Goru Vaari – Kasha Yandhu Ledhugaa || Paramulona || Vrudhi Sarcha Manedu Vaani – Sudhu Landhu Levugaa = Sadhuleni Chota Nepudu – Swami Seva Galgaga || Paramulona || Yella Roga Shramal Manaku – Neee Stalambhulonegu = Kalagaadhu Kristhu Manaku – Ganti Neeelu Dhuduchughaa || Paramulona || Andhakaaramaina Karyamu – Laa Sthalamuna Levuga = Sandhe Velugu Velugu Natlu – Swami Sanidhi Yundaga || Paramulona || Dhongavaani Valana Manaku – Dhopu Lemi Levuga = Yagalaarpu Dhirchi Migula – Ghanuni Prema Galguga || Paramulona || Anna Panamulamdhu Manku – Nasa Yemi Ledhuga = Kanna Thandri Kanna Migula – Ghanuni Prema Galguga || Paramulona || ✍ Gollapalli Nathaniyelu akk 1 Read more
No comments:
Post a Comment