1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట గానముఁ జేయుఁడు సుకీర్తనను } 2యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము|| తన్నామము నుతించి యతని } 2రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము|| ఘనతయు మహత్మ్యమును } 2 దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము|| పరిశుద్ధాలంకారముతో } 2నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము|| పరిపాలించుచున్నాఁడనుచు } 2తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము|| ఏమనిన నా మహాత్ముండు } 2వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము|| జనులారా యా యెహోవాకు } 2మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము|| ✍ విలియం డాసన్ Gaanamu cheyudu sukiirthananu=Yohoavanu guurichi krotha gaanu rakthi gaanu || Ganamu || Thannaamamu nuthinchi athani-raksha- chennuga saarebra –siddhamu chesi = pannuga nanyulaloa thanamahima-yan-dhunnatha chithramu-lanu chaatandi || Ganamu || Ghanathayu mahathyamunu-dha-dhghanani yedhuta nundu- ghana balamunu = vinathamou soundharyamunu –na- thanivi nirmala sthala- muna vilasillu right;"> || Ganamu || Parisuddhaalankaaramuthoa-naa – paramaathmaaraadhana –parulai yundandi = dharani sakala janulaaraa – loaka – guruni yedhuta bhiithi –gonuchu nundandi || Ganamu || Paripaalinchu chunnaadanuchu thoadi –narulathoa cheppudi-ddhara gadhakunda = sthiramuga cheyu sathyamugaa- janula- karimuri gaanu nyaa-yamu vimarsinchu || Ganamu || Eamanina naa mahaathmundu – vachchu – nii mahiki nyaayamu –nerparachutaku = bhuumi janulaku niithi sathya-mula – thoa minchu nyaaya men-thoa vimarsinchu || Ganamu || Janulaaraa aa yohoavaaku- mahi –manu balamunu samarpanamu cheyandi vinayamuthoa kaanukalanu – thiisi- koni thathpraakaara mandhuna vasiyimpandi || Ganamu || ✍ William Dason akk 1 Read more
No comments:
Post a Comment