1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక లేదుగా దోసముల నెడబాపి పరమని వాస పదవికిఁ జేర్చుఁగా ||యేసు||నిత్య రక్షణ నిత్య జీవము నిజముగా మాకిచ్చును సత్యసువిశేషార్థసారము సతము గ్రోలుట కొసఁగెను ||యేసు||దురిత భవ మను నంధకారము దూరముగఁ బోఁదోలెఁగా అరయఁ దన విమలాత్మ వరమున మరల మము వెలిఁగించెఁగా ||యేసు||గొప్ప కుల గర్వముల మెప్పను తప్పుల న్విడఁగొట్టెను చెప్ప శక్యముగాని రక్షణ సృష్టిలో మము నిల్పెను ||యేసు||అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను దొడ్డ కాపరి యేసు తన దగు దొడ్డిలో మముఁ జేర్చెను. ||యేసు|| ✍ గొల్లపల్లి నతానియేలు Yesu Nii Naamaamruthamu Kannanu- Vare Maakia Ledhugaa = Dhoashamula Neda Baapi Paramani – Vaasa Padhavaki Cherchugaa || Yesu || Nithya Rakshana Nithya Jiivamu – Nijamugaa Maakichch Unu = Sathya Suviseshaa Rdha Saaramu – Sathamu Groaluta Kosagenu || Yesu || Dhuritha Bhava Manu Nandha Karamu – Dhuuramuga Poa Dhoalegaa = Araya Thana Vimalaathma Varamuna - Marala Mamu Veliginche Gaa || Yesu || Goppa Kula Garvamula Meppanu – Thappula Nidva Gottenu = Cheppa Sakhyamu Kaani Rakshana – Srushtiloa Mamu Nilipenu || Yesu || Addu Parachu Pisaachi Maargapu Jiddulanu Chedhin Chenu = Dhodda Kaapari Yesu Thana Dhagu – Dhoddiloa Mamu Cherchenu Yesu Nii Naamaamruthamu || Yesu || ✍ Gollapalli Nathaniyelu akk 1 Read more
No comments:
Post a Comment