25 రక్షణకొరకు కృతజ్ఞత రాగం - జంఝూటి తాళం - ఏక పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి గాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనక మరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి ||పరలోక||యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది న్యాయమౌ గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు ||పరలోక||ఎన్నరాని మహిమ నుండి యేసు నన్నుఁ బాలింప నేతెంచి యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసఁగె నాకుఁ ||బరలోక|| ✍ పురుషోత్తము చౌధరి Paralokamuna nundu dheva – nii padhamula konarinthu seva = dhurithambulaku nenu verachi yunnaanani - karuninchi nii suthuni – dhara kampithivi gaadhaa = arayagaa nii preama yinthana - tharamu gaadhoa parama janaka - marana paryan thamu ninu ne maruva jaalanu – vara krupaa nidhi Paraloakamuna nundu || Paraloka || Yesu kriisthuni dhaya seya – kunna – moasa mondhedha nendhukanna= dhoasambu laku nenu - dhaasundanai prathi – vaasarambunu niidhu – baasu raajnalu vidachi = vesatalu gala narakamuna bada - throasina adhi nyaayamou gadha – naa sunaadhaa permi chethanu nii suthunin pampinchi naavu Paraloakamuna nundu || Paraloka || Eannaraani mahima nundi - yesu –nannu paalimpa nethenchi = yenna sakhyamu gaaka - yunna paapamu lanni - chinnaa bhinnamu chesi = nannu sammathi parapa anna yagu naa raksha kudu - thannu thaa narpinchi vendiyu – unnathundai lechi yippudu – sanni dhaanambosage naaku || Paraloka || ✍ Purushottam Chowdhary ttt akk 25 Read more
No comments:
Post a Comment