1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ దండ్రిన్ ధాత్రిని మన పర మాత్ముని వాక్కులు స్తోత్రములోఁ గలిపి || స్తోత్రము || ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన మం దఱముఁ గలిసికొని యానందింతుముగా || స్తోత్రము || ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను || స్తోత్రము || కన్నీ రుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను మన శృం గారపు బ్రతుకు లెన్నఁదరము గాదె || స్తోత్రము || వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగము లెంతో రమ్య మై యుండును బాగింతన లేము || స్తోత్రము || మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము త్వరలో మున పర లోకపు దండ్రి తోడ నుందు మేమో || స్తోత్రము || గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా || స్తోత్రము || పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్ || స్తోత్రము || ✍ గొల్లపల్లి నతానియేలు Sthothramu Seyare – Soadharulaara Mana- Aathmalathoa Thandrin- Dhaathrini Mana Para- Maathmuni Vaakkulu –Sthoathramuloa Kalipi || Sthothramu || Ichchata Premala – Kidhiye Kadavari – Vachchi Yunna Dharmoa = Ichchata Manamandharamu Kalisi Koni – Aanandhinthumu Gaa || Sthothramu || Ekkuva Premalu – Chakkani Sthoathramulu- Akkada Manamantha = Mikkili Priyudu – Dhevunu Kidudhumu – Okka Manasu Thoada || Sthothramu || Kanneerundadhu – Chaavu Kashatamulu – Ennati Kundavugaa = Kannanu Mana Srungaarapu Brathukulu –Ennatharamu Kaadhe || Sthothramu || Vaagunu Veenelu – Saagunu Paatalu – Sathathamugaa Achata = Raagamu Lenthoa – Ramyamai Yundunu – Baaginthana Lemu || Sthothramu || Marala Ichata Kuududhumoa Ledhoa – Mana Mandharamu = Thvaraloa Mana Paraloakapu Thandri – Thoada Nundhu Memoa || Sthothramu || Gorre Pilla Rakthamu – Viluvachchata – Goppadhi Kaanthumugaa = Guru Tharamagu Ana Dhevuni Premanu – Kuurmithoa Chuuthumugaa || Sthothramu || Parama Thandrithoa –Prabhu Yesunithoa- Parisudhdhaathmunithoa = Sthiramuga Nundhumu - Mari Dhuuthalathoa – Paraloakamu Nandhun || Sthothramu || ✍ Gollapalli Nathaniyelu akk 605 Read more
No comments:
Post a Comment