1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు నాయకుడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసములన్నిటి మునగద్రోతునని బాసలు జేసిన ప్రభుడవు నీవెగా ||యేసు||రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుడ నీవెగా ||యేసు||హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునబెంచుము మాపాలకుడవో ||యేసు||మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముడ నీ దయ మరువశక్యమా ||యేసు|| ✍ గొల్లపల్లి నతానియేలు Yesu nayakuda-Yella Velalanu Nii- Dhaasula Nelumayyaa =Moasamu Lanniti – Munagan Throathunani- Baasalu Chasina –Prabhudavu Niivegaa || Vaaru || Reyimbavalu Maa- Nyaayamu Cheripedi- Maaya Pisaachini = Throayumi Dhuuramu – Baayaka Bhakthula- Cheyi Viduvani Bahu Sreshtuda Niivegaa || Vaaru || Hrudhayamu Loakamu – Madhi Paapamu Mammu- Sathathamu Srama Pettunu = Sadhayuda Mammunu – Vadhalaka Nithyamu – Madhi Thalapulaloa – Mahimaga Nelumii || Vaaru || Kaapaadumi Mammu – Maapu Repu Nii – Sree Paadha Mulodhdhanu = Ee Paapamu Lunu Eelakundaga Nii – Praapuna Penchumu – Maa Paalakundavoa || Vaaru || Maakorakai Nii – Menunu Mraanuna – Mekulatho Kottagaa – Maanamu Mahimalumanujula Kiyyanu- Bhaanuda Raajuga – Brathiki Lechithivi || Vaaru || Cheranu Cheranugaa – Mari Pattuka Niivu – Paramuna Karigithive – Varamula Nidithivi - Dharaloa Narulaku – Paramuda Nii Dhaya Maruva Sakhyamaa || Vaaru || ✍ Gollapalli Nathaniyelu akk 1 Read more
No comments:
Post a Comment