1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట జడియకుము నే నే యున్నానని కడు నెనరు వాక్కిచ్చిన యేసుని యడుగుజాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా యిడుమ లధికము గలిగిన ప్రభుని కడకుఁ జేరరాదా ||జడియకుము||ఇప్పుడు నిను బాధపరచెడి ముప్పులం దలపోసి తప్పక గొప్ప ప్రేమార్థంపు శిక్షకు నొప్పియుండరాదా నీ తప్పులన్ విడి ప్రభువు నందు మెప్పు బొందరాదా ||జడియకుము||ఘనము ధనము సౌఖ్యంబు బోయి వ్యసనము శోధన మున్న యోబు మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు దృఢంబటుల జేసి మహిమ పరపరాదా ||జడియకుము||బీద లాజరుండు భువిని బాధ నొందిన సాదృశ్యంపు బోధన నీ మానసమున పాదుకొనలేదా యతఁ డాదరింపఁబడిన విధము మోద మియ్యలేదా ||జడియకుము||మున్ను సైఫనును రాళ్లతోఁ గొట్టు చున్న పగతుర కొరకు దేవుని మిన్ను వైపునఁ జూచి యోర్చి మన్న నడుగలేదా నీ కున్న శ్రమలటు లోర్చఁ బ్రభువు తెన్నుఁ జూపలేడా ||జడియకుము||భక్త జనులను ఖైదుకు నీడ్చి బాధలు గావించినప్పుడు శక్తి హీనుల మంచు యేసుని శక్తి నమ్మలేదా యా యుక్తసహాయము దొరకువరకా సక్తి నుండలేదా ||జడియకుము|| ✍ బేతాళ జాన్ Jadiyakumu ne ne yunnaanani–kadu nenaru vaakkichchina yesuni – adugu jaadalu vembadinchi – naduchu kona raadhaa – jiivaa = yiduma ladhikamu kaligina prabhuni – kadaku chera raadhaa || Jadiyakumu || eippudu ninu baadha parachedi – muppulan thalapoasi thappaka - goppa premaardhampu sikhaku – noppi yunda raadhaa – nii = thappulan vidi prabhuvu nandhu – meppu pondha raadhaa || Jadiyakumu || ghanamu dhanamu sowkhyambu poayi – vya –sanamu soadhana munna yoabu – manasu dhrudamu chesi prabhuni - mahima parapa ledhaa – nii – manasu dhrdambatula jesi – mahima parapa raadhaa || Jadiyakumu || biidha laazarundu bhuvini – baadha nondhina saadhrusyam pu – boadhana nii maanasamuna – paadhuko0na ledhaa – atha = daadharimpa badina vidhamu – moadha miyya ledhaa || Jadiyakumu || munnu sthephanunu raallathoa gottu – chunna pagathura koraku dhevuni – minnu vaipuna juuchi yoarchi – manna naduga ledhaa – nii kunna srama latu loarcha prabhuvu – thennu chuupa ledaa || Jadiyakumu || bhaktha janulanu khaidhuku niidchi – baadhalu gaavinchi nappudu – sakthi hiinula Manchu yesuni – sakthi namma ledhaa – yaa = yuktha sahaayamu dhoraku varakaa – sakithi nunda ledhaa Jadiyakumu ne ne yunnaanani– || Jadiyakumu || ✍ Bethala John akk 1 Read more
No comments:
Post a Comment