336
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఏమియున్ గ్రహింపకున్న మర్త్యు డెంద మాశతో నిన్ను గూర్చి తృష్ణ గొన్న యాత్మ యేడ్చు మెండుగా కోయబడ్డ గడ్డి మంచు గోరునట్లు పాపులు నీవె రక్షకుండ వంచు నిన్ సదా యాశింతురు.
ద్వీపవాసు లెత్తి కేలు కోరుచుందు రిప్పుడు నీదు సేవకాళి నంపి యాత్మ క్రొంత్త జన్మమున్ ప్రేమదీప్తి జ్ఞానకాంతి గల్గం జేయు వాక్యము నిచ్చి గొఱ్ఱె పిల్ల కీర్తిన్ వారి నోట నుంచుము