337
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దేవుని చేత ని ర్తోషిగ దీర్చ బడిన వాడు భావంబున లేశం బయినను గ పటము లేనివాడును ధన్యుండౌ ||తన||
- మునునేని మౌని నై దిన దినమున నేనొనం చిన నా యార్త ధ్వనిచే క్షీణిం చెను నా యెముకలు సకలం బకటా ||తన||
- రేయి పగలు నా మీ దను నీ చేయి భారమయ్యె గాయము నందలి సారము వేసవి కాలంబున నెండిన విధ మాయెను ||తన||
- కప్పుకొనకయే నీ యెదుట గలుష మెప్పుకొంటి నొప్పుకొందు ననుకొంటి నక్రమ మోర్పుతోడ బాపము మన్నించితి ||తన||
- కావున నీ సంద ర్శనపు గాలమందు భక్తుల్ భావము రంజిల నిను బ్రార్థింత్రు ప్ర వాహంబులు వారలపై బొరలవు ||తన||
- దాగు చోటు నీవే శ్రమలను దప్పించెద వీవే వేగ విమోచన గానంబులతో విడువక నీవే యావరించెదవు ||తన||
- నీ కుపదేశింతు మార్గము నీకును బోధింతు నీ కాలోచన నే జెప్పె దను నీ మీదను దృష్టించి సతంబు,ను ||దన||
- జ్ఞానము లేనట్టి గుఱ్ఱమ ట్లైనను ఖరమువలె నైనను మీరుండకు డని కళ్లెము తో నెంతో బిగియింపబడవలె ||దన||
- కలుగు ననేకములౌ వేద నలు కడు భక్తి విహీ నులకు నమిత కృప దేవుని విశ్వా సుల జుట్టుకొని యుండు నిజంబుగ ||దన||
- సంతోషించుడి నీతి మంతులార సత్య స్వాంతులారా మీరంద ఱత్యంత సంతోషంబున గానము జేయుడి ||తన||
- జనక తనయ పరిశు ద్ధాత్మ కును మహిమము గల్గు మును పిప్పుడు నెల్లప్పుడు యుగముగ ములకును దనరారును గాకామేన్ ||జనకతనయ||