338
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- చింతలు పోయెన్ వింతగ నాకున్ జెంతకు జేర్పగ సంతస మాయెన్ ||యేసుడు||
- సిలువను మోసెన్ గలువరి మెట్టన్ చెలువుగ బాపపు బలువును దించెన్ ||యేసుడు||
- శిరమున ముండ్లున్ గరమున మేకులున్ స్థిరముగ నాటగ బరమును జూపెన్ ||యేసుడు||
- పదముల మేకులున్ జెదరగ రక్తము ఎద నిక బ్రేమతో ముదము నొసంగెన్ ||యేసుడు||
- రక్షణ జూపెన్ దక్షుడు నాకున్ పక్షముతో నిక మోక్షము జూపెన్ ||యేసుడు||
- రక్తిగ వేడన్ శక్తి నొసంగెన్ రక్తము జల్లియు ముక్తిని జూపెన్ ||యేసుండు||
- గురువును నమ్ముదున్ భారము వెడలెన్ ధీరుని జేయుచు దారిని జూపెన్ ||యేసుడు||