a371

371

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము నీ వాశ్చర్య మొందెదవు. వానికై. ||ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచుచూడు మేసుదీవెనల్ ఎంచు మెంచు మెంచు మీవులన్ వింత నొందెదవు నీవు వానికై ||

  1. చింతమానసంబు నీకు గల్గినన్ వంతచే భారంబు గల్గ నీయెదన్ సంతసంబుతోడ నెంచుమీవులన్ వింత నొందెదవు నీవు వానికై
    నాశనంబు జెందు నాస్తి జూడగా వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన భాసురంపు భాగ్యముం దలంపుమా యీ సౌభాగ్యమే గదా సదా యుండు
    జీవితాదియందు ధైర్య మొందుము దేవుడుండు నెల్లవార్కి తోడుగ జీవయాత్ర యందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు.

Post a Comment

Previous Post Next Post