a372

372

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్ను చుండు గాక సకల లోకము క్షేమముగను విమలముగను జెన్ను మిరగ బరలోక ధాముడవై వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య ||ఓ మా తండ్రి||

  1. నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగ బరలోకమందున నే రీతిగను జేయబడునో యీ భూలోకమందు నట్టి దారి బొంద జేయవలెను ధర్మ మూర్తి సత్యవర్తి ||ఓ మా తండ్రి||

  2. నేటి యాహారంబు మాకు గరుణజేసి నేటి కిచ్చి సూటి పరచుమి మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప నీవె మాకు వేరె లేరు సుమ్ము ||ఓ మా తండ్రి||

  3. మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరల జేయు మమ్ము నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే మాదు ప్రార్థ న నమ్ము జేకొమ్ము ఆమేన్ ||ఓ మా తండ్రి||

Post a Comment

Previous Post Next Post