373
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- జన రహిత స్థల మున జని వేడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునట ||దాసుల||
- మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకు జెవు లొగ్గున్ హృదయము కనుగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల||
- ముదమున నిద్దరు ముగ్గురు నొకచో బదిలముగా దను బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగ బలికిన కృత రక్షణు(డట ||దాసుల||